కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాన దంచికొట్టడంతో పలు మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఆళ్లపల్లి మండలంలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇల్లెందు ఏరియాలో 13.5 మిల్లీమీటర్లు, కరకగూడెంలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మణుగూరు సింగరేణి జీఎం ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో 8 మిల్లీమీటర్లు, అశ్వాపురంలో 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా, చర్ల మండలం సత్యనారాయణపురంలో నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

