Mobile Popup Ad
Mobile Popup Ad

ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో భారీ చేరికలు

కలం, నిర్మల్: భైంసా (Bhainsa) పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్లమెంట్ సభ్యుడు గోడెం నగేష్ (MP Nagesh), ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమక్షంలో వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>