కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పట్టణ ప్రజలకు త్వరలోనే కొత్త పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. అంబేడ్కర్ సెంటర్ వద్ద అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మిస్తున్నారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ నాగబాబు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగి, ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.
ఆధునిక హంగులతో..
నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. అద్దాలు, ఆకర్షణీయమైన రంగులతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిబ్బందికి, స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలతో భవనాన్ని నిర్మించారు. త్వరలోనే ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ అందుబాటులోకి వస్తే శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!
Follow Us On: Instagram

