కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) (61) 60 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొద్ది కాలం నుంచి గౌరీ స్ప్రాట్ అనే ఫ్యాషన్, స్టైలిష్ట్తో డేటింగ్ చేస్తున్న అమీర్ ఖాన్.. తన ప్రియురాలను జూలై 5న పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజాగా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ముంబైలో జరిగిన రాజ్ కుమార్ హిరాణీ సినిమా స్కీనింగ్ వేడుకలో పాల్గొని తన మూడో పెళ్లి వేడుక వివరాలను వివరించారు.
జూలై 5న తాను, గౌరీ స్ప్రాట్ పెళ్లి చేసుకోబోతున్నామని.. ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నామని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ఇరువురు కుటుంబ సభ్యులు, కొందరు అత్యంత ఆప్త మిత్రులు, చిన్న నాటి స్నేహితుల సమక్షంలో ఇంట్లోనే నిరాడంబరంగా వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేశారు. తమ వైవాహిక జీవితంగా సంతోషంగా సాగేలా దీవించాలని మీడియా ద్వారా అభిమానులను కోరారు. కాగా, అమీర్ ఖాన్ కు గతంలో రీనా దత్తా, కిరణా రావులతో వివాహం అయింది. అమీర్ ఖాన్, రీనా దత్తాలకు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉండగా.. అమీర్ ఖాన్, కిరణ్ రావు లకు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అమీర్ ఖాన్ రీనా దత్తాతో 2002లో, కిరణ్ రావుతో 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు గౌరి స్ట్రాట్కు కూడా గతంలో వివాహం జరిగింది. కుమారుడు పుట్టిన తర్వాత ఆమె విడాకులు తీసుకున్నారు.

