Mobile Popup Ad
Mobile Popup Ad

సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికి: ప్రకాశ్ రాజ్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనంగా మారిన యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) స్పందించారు. అతనికి కోర్టులు బెయిల్ ఇస్తున్నా.. వరుస కేసులు పెడుతూ మళ్లీ అరెస్ట్ చేయడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. ఈ సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికి అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అతనిపై ఓ 30 కేసులు ఉన్నాయంట కదా? ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంత దూరం వెళ్తారు? అని నిలదీశారు. ప్రజలు ఈ కక్ష సాధింపు చర్యలను గమనిస్తున్నారని.. త్వరలో జోసెఫ్ ని వదిలేస్తారని అశిస్తున్నానని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు పెట్టారు.

ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సంఘాలు నిర్వహించిన నిరసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో ప్రశ్న రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పిఠాపురంలో మేజిస్ట్రేట్ లో ముందు రావణ్ ను హాజరుపరచగా.. బెయిల్ మంజూరు అయింది. కానీ రావణ్ పై మచిలీపట్నంలో మరో ఫిర్యాదు నమోదు కావడంతో అతన్ని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>