Mobile Popup Ad
Mobile Popup Ad

దుమ్ముగూడెంలో పశువుల అక్రమ రవాణా

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం (Dummugudem) మండలంలో పశువుల అక్రమ రవాణా కలకలం రేపింది. వాహనంలో తరలిస్తున్న 12 పశువులను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్యాంప్రసాద్ వివరాల ప్రకారం.. ములకపాడు కూడలి వద్ద పోలీసులు గురువారం వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో చర్ల నుంచి పండితాపురం వెళ్తున్న అనుమానాస్పద వాహనాన్ని గమనించారు. నంబర్‌ ప్లేట్ లేకపోవడాన్ని గమనించిన పోలీసులు లోపల పరిశీలించగా, అనుమతులు లేకుండా 12 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

వాహనంలో ఉన్న పాల్వంచకు చెందిన షేక్ కాశీం, షేక్ హన్నులతో పాటు డ్రైవర్ వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువులను స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యాంప్రసాద్ వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను అక్రమ రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>