ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని వినతి

క‌లం మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో 1990లో 381 సర్వే నంబరులో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు తెలిపారు. ఇప్పటివరకు స్థలాలు మాత్రం ఇవ్వలేదని, వెంటనే సమస్య పరిష్కరించాలని ప‌ట్టాదారుల‌తో క‌లిసి సంగారెడ్డి కలెక్టరేట్ సూపరింటెండెంట్ శంభురెడ్డికి వినతి పత్రం అందించారు.

తమకు కేటాయించిన స్థలం ఎక్కడుందో స్ధ‌లం ఎక్క‌డుందో తెలియ‌క ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. విధి లేక పేదలు కట్టుకుంటున్న గుడిసెలపై అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>