మెదక్ జిల్లాలో రికార్డు స్ధాయిలో ధాన్యం కొనుగోళ్లు

క‌లం మెద‌క్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు క‌లెక్ట‌ర్ ప్ర‌తీమా సింగ్ తెలిపారు. యాసంగిలో గతంలో కంటే 1.08 ల‌క్ష‌ల‌ మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా పండిందని, జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తయిందన్నారు. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసి, వారి అకౌంట్లలో రూ.1005.66 కోట్లు జమ చేశామన్నారు.

ఏప్రిల్ 8న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు జూన్ 27వ తేదికి పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లాలో 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో పీఏసీఎస్ 305, ఐకేపీ 185, డీసీఎంఎస్ 43 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>