కాలువ ఆక్రమణపై రైతుల పోరుబాట.. నిర్మల్ కలెక్టరేట్ వద్ద ఆందోళన

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా నర్సాపూర్ (జి) మండలం గొల్లమాడ గ్రామంలో పెద్ద చెరువు కాలువ ఆక్రమణకు గురైందని ఆయకట్టు రైతులు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన (Farmers Protest) చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలోని పెద్ద చెరువు ప్రధాన కాలువతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పిల్ల కాలువ, పెద్ద చెరువు ప్రధాన కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, కాలువకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సింధే దీక్షిత్ పటేల్ అనే వ్యక్తి ఆక్రమించారని ఆరోపించారు.

ఈ విషయాన్ని ప్రశ్నించిన గ్రామ రైతులపై దురుసుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ మూసివేత కారణంగా దాని నీరు లేక పంటలు ఎండిపోవడంతోపాటు, సాగుభూములు క్రమంగా బీడుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కాలువ హద్దులను సర్వే చేసి, ఆక్రమణలు ఉన్నట్లయితే వాటిని తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు.

Also Read : బీజేపీ కొత్త కార్యవర్గం ప్రకటన

Follow Us On: Instagram

ఆదిలాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>