Mobile Popup Ad
Mobile Popup Ad

నారాయణ, శ్రీ చైతన్య కిచెన్‌లో తనిఖీలు.. నోటీసులు జారీ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నారాయణ, శ్రీ చైతన్య (Narayana and Sri Chaitanya) విద్యాసంస్థల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాధాపూర్‌లోని నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ సెంట్రల్ కిచెన్‌లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. వంటగదిలో నీరు నిల్వ ఉండటం, ఈగల బెడద, తెరిచి ఉన్న డస్ట్‌బిన్లు ఉండటాన్ని గుర్తించారు. తాజా నీటి పరీక్ష నివేదికలు లేకపోవడం, వేడి నీటితో యంత్రాలు శుభ్రం చేయకపోవడం, ఆహార రవాణా వాహనాల్లో తుప్పు వంటి లోపాలు ఉన్నట్లు తేల్చారు. కిచెన్‌లో పిల్లులు, వీధి కుక్కల సంచారిస్తున్నాయని, వంటశాల అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. విద్యాసంస్థకు పరిశుభ్రత అంచనా (హైజీన్ స్కోర్) 138 మార్కులకు 98 (71%) మాత్రమే ఇస్తూ యాజమాన్యానికి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.

శ్రీ చైతన్య గ్రూప్ (శ్రీ వసిష్ట ఎడ్యుకేషనల్ ట్రస్ట్) సెంట్రల్ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. వంటగది డోర్ దగ్గర దెబ్బతిన్న నేల కారణంగా నీరు నిలిచిపోతోందని.. కుళ్ళిన కూరగాయల ముక్కలు అక్కడ చిక్కువడం వల్ల క్రిములు వ్యాపిస్తున్నాయని తెలిపారు.కిటికీలు తెరిచి ఉండటం వల్ల ఈగల బెడద అధికంగా ఉందని పేర్కొన్నారు. ఈగలను పట్టుకునే పరికరాలు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఆహారం ఒలికిపోయిన, తెరిచి ఉన్న చెత్తబుట్టలు దుర్వాసన వస్తున్నట్లు తెలిపారు. స్టోర్ ప్రాంతంలో పిల్లి మలం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. బంగాళాదుంప తొక్క తీసే యంత్రం అపరిశుభ్రమైన స్థితిలో ఉందని.. వంటశాల అపరిశుభ్రంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విద్యా సంస్థకు హైజీన్ స్కోర్ 67 శాతం ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>