కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు (Outsourcing – Contract Employees) శుభవార్త అందుతోంది. ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు జమ కానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉద్యోగుల జీతాలను విడుదల చేసింది. దీంతో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల చెల్లింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
కాగా, జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు ఆలస్యం లేకుండా అందాలని ఇటీవల అధికారుల్ని ఆదేశించారు. దీంతో ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

