Mobile Popup Ad
Mobile Popup Ad

డీఎంహెచ్ఓ పై ఎమ్మెల్యే నాయినికి ఫిర్యాదు

కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న పరిస్థితులపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. బుధవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఎన్‌జీఓస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ నాయకత్వంలో జేఏసీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

డీఎంహెచ్ఓ వ్యవహార శైలి కారణంగా వైద్య ఆరోగ్యశాఖలోని ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఎమ్మెల్యేకు వివరించారు. ఉద్యోగుల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్య తీవ్రతపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఫోన్ లో మాట్లాడారు.

ఉద్యోగులు వ్యక్తం చేసిన ఆందోళనలను మంత్రికి వివరించి, అంశాన్ని ప్రాధాన్యతతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ మోహన్ రావు, ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణా కృష్ణారావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రాజిరెడ్డి, ఏఓ కోలా రాజేష్, కె.యాద నాయక్, బి నెహ్రూచంద్, జె సుధాకర్‌, మాధవరెడ్డి,డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ ప్రదీప్ రెడ్డి, పలువురు డాక్టర్లు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>