కలం, వెబ్ డెస్క్: సింగరేణిపై తాము చేసిన వ్యాఖ్యలు అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో (Kyathanpally) సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. సింగరేణిని కాపాడుకోవాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా తాము ఆరోపణలు చేసినా కాంగ్రెస్ చప్పుడు చేయడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనన్నారు.
కేవలం తెలంగాణకే సింగరేణి స్వంతం..
సింగరేణి (Singareni) అనేది దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదని.. కేవలం తెలంగాణకే సొంతమని హరీశ్ రావు (Harish Rao) కొనియాడారు. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క బొగ్గు గని ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులు రాష్ట్ర ఉద్యమ సమయంలో చేసిన పోరాటం అంతా ఇంతా కాదని అన్నారు. ఉద్యమ సమయంలో కార్మికుల పోరాటంతో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పందించారని గుర్తు చేశారు. బొగ్గు బావులు మూతబడ్డాయని, థర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర బొగ్గు లేదని, విద్యుత్ సరఫరా ఆగిపోతదని, దీంతో దక్షిణ భారతదేశమే ఆగమైతదని ప్రధాన మంత్రి కూడా దిగివచ్చే విధంగా గొప్ప సకల జనుల సమ్మె సింగరేణి కార్మికులు చేశారని గుర్తు చేశారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు బొగ్గు ఇచ్చేది సింగరేణి అని చెప్పుకొచ్చారు.
ఆనాటి తెలుగు దేశం పార్టీ, ఆనాటి జాతీయ పార్టీలు డిపెండెంట్ ఉద్యోగాలు నిషేధించారని హరీశ్ రావు గుర్తు చేశారు. చంద్రబాబు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించలేదని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ఇంటి ఇళ్ల పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసిందని అన్నారు.
Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?
Follow Us On: Instagram

