కలం, వెబ్ డెస్క్ : మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ (WhatsApp) ఇటీవల ప్రవేశపెట్టిన ‘యూజర్‌నేమ్ ఫీచర్’ (Username Feature)పై భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఫోన్ నంబర్ షేర్ చేయకుండా కేవలం యూజర్‌నేమ్‌తోనే చాట్ చేసుకునేలా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ వల్ల మోసాలు, ఫేక్ ప్రొఫైల్స్ పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం .. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ ను పరిశీలిస్తుందని, యూజర్ల భద్రత , గోప్యత అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ వల్ల నేరాల దర్యాప్తులో వినియోగదారులను గుర్తించడం కష్టతరమయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘టెలిగ్రామ్’ తరహాలోనే ప్రైవసీ దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఎడిట్ చేసిన మెసేజ్‌లు, నకిలీ గ్రూపులు, యూజర్‌నేమ్‌ల ద్వారా ఎవరైనా మోసాలకు పాల్పడితే గతంలో నీట్ పరీక్ష సమయంలో ‘టెలిగ్రామ్’ యాప్ పై తీసుకున్న తరహాలోనే వాట్సాప్ సంస్థపై కఠినమైన చట్టమైన చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపినట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.
ఇదిలాఉంటే యూజర్‌నేమ్ ఫీచర్‌ను జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వాట్సాప్ (WhatsApp) సంస్థ.. దీనివల్ల వల్ల యూజర్లు తమ ఫోన్ నంబర్లను బహిర్గతం చేయకుండానే, కేవలం యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో సంభాషించే అవకాశం ఉంటుందని చెప్పింది. ఇది యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తుందని తేల్చి చెప్పింది. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించకుండా ఉండేందుకు కొన్ని పేర్లను ముందస్తుగా రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. యూజర్లు తమకు నచ్చిన, యూనిక్‌గా ఉండే పేరును రిజర్వ్ చేసుకోవాలని సంస్థ సూచించింది.
Read Also: ఎంపీ ఇంట్లో సోదాలు.. బంగారు లోదుస్తులు, కోట్ల నగదు సీజ్
Follow Us On: Instagram

