Mobile Popup Ad
Mobile Popup Ad

ఫారాలు ఇవ్వకుంటే.. ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండదు: ఆర్డివో సుబ్రహ్మణ్యం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో సర్ ప్రక్రియ ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి తిరిగి ఇవ్వని వారి పేర్లు కొత్తగా వచ్చే ఓటర్ జాబితాలో ఉండవని వనపర్తి ఆర్డివో సుబ్రమణ్యం (Wanaparthy RDO Subrahmanyam) స్పష్టం చేశారు. స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇప్పటికే ఇంటింటికి తిరిగి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను 2002 ఓటరు జాబితాలోని వివరాల ఆధారంగా పూరించి ప్రస్తుత ఫోటో అతికించి తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని మీడియా ద్వారా ప్రజలను కోరారు.

బుధవారం ఆర్డీవో కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో (Wanaparthy RDO) వివరిస్తూ ఇప్పటివరకు ఓటరుగా ఉండి గత ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు సైతం బీఎల్వోలు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలను నింపి ఇవ్వాల్సి ఉంటుందని.. లేనిపక్షంలో కొత్తగా ఏర్పాటు ఓటరు జాబితాలో పేరు నమోదు చేయబడదని తెలియజేశారు.

ఇబ్బందులు ఉంటే బీఎల్వోలను అడగాలి..

బీఎల్వోల ద్వారా ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను జాగ్రత్తగా పరిశీలించి 2002లో ఓటర్లు అయి ఉంటే.. వారంలో 1, 3వ భాగాలను పూరించి లేటెస్ట్ ఫోటో అతికించి ఫారంపై సంతకం చేసి ఒక కాపీ బీఎల్వోకి ఇచ్చి మరో కాపీని బీఎల్వో వద్ద రిసిప్ట్ గా రాయించుకుని వద్ద ఉంచుకోవాలని తెలియజేశారు. ఫారాలను నింపడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే బీఎల్వోలను అడిగి వారి సూచనల మేరకు ఫారం నింపుకోవాలని తెలియజేశారు.

వనపర్తి జిల్లాలో 2,75,570 ఓటర్లు ఉండగా ఈరోజు వరకు 2,36, 060 ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోల ద్వారా ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన ఫారాలను సైతం గురువారంలోగా 100% పంపిణీ పూర్తి చేస్తామని తెలియజేశారు. ఫారం నింపడంలో బీఎల్వోలకు పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఎనుమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిన వాటిని పరిశీలించి జులై 31 నాటికి ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచడం జరుగుతుందన్నారు.

ఓటర్లందరూ విధిగా ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకొని ఒకవేళ పేరు లేకుంటే ఆర్డీఓకు అప్పీల్ చేసుకొని జాబితాలో పేరు నమోదు అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. అక్టోబర్ ఒకటో తేదీ 2026 నాడు తుది ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.

అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి అవుతున్న యువతీ యువకులు సైతం ఫారం 6ను పూరించి బీఎల్వోలకు జూన్ 24 లోపు అందించాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు ఏమైనా మార్పు చేర్పులు చేయాలనుకుంటే ఫారం 8 నింపి చేంజెస్ చేసుకోవచ్చని తెలియజేశారు.

Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>