epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చైనా కీలక నిర్ణయం, భారతీయుల కోసం ఆన్‌లైన్‌ వీసా విధానం

కలం, వెబ్ డెస్క్: తమ దేశాన్ని సందర్శించాలనుకునే భారతీయులకు (Inidans) చైనా గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌ వీసా దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. చైనా ఆన్‌లైన్ వీసా దరఖాస్తు వ్యవస్థను ప్రారంభించడం ద్వారా మన దేశస్తులకు వీసా ప్రక్రియను మరింత సులువుగా, వేగంగా మారనుంది. ఈ కొత్త విధానంలో దరఖాస్తుదారులు తమ దేశ అధికార వెబ్‌సైట్‌లో వీసా దరఖాస్తును నింపి, కావాల్సిన డాక్యుమెంట్లను ఆప్‌లోడ్‌ చేయాలని భారత్‌ లోని చైనా ఎంబసీ తెలిపింది. దరఖాస్తు ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే  మెయిల్ కూడా వస్తుంది.

మొత్తం 7 దశల్లో అప్లయ్ చేసుకునేలా వీలు కల్పించింది. ఈ ఆన్‌లైన్ వీసా ప్రాసెసింగ్‌తో సమయం ఆదా అవుతుంది. న్యూఢిల్లీలోని చైనీస్ వీసా దరఖాస్తు కేంద్రం ప్రయాణికుల  కోసం ఎప్పటికప్పుడు సేవలందిస్తోంది. ఆన్‌లైన్‌ వీసా దరఖాస్తు విధానం వల్ల భారత్-చైనా (China) మధ్య రాకపోకలు మరింత బలపడనున్నాయి. పర్యాటకం, వ్యాపారం మొదలైన రంగాల కోసం చైనాకు వెళ్లేవారికి వీసా విధానం ఉపయోగపడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>