Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ​ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రులను కాపాడి హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>