కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ (Warangal CP)గా ఎన్. శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె నూతన బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, మరింత మెరుగైన పోలీసింగ్ సేవలందించడానికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు.
పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్. శ్వేతారెడ్డి వరంగల్‌లోని ప్రముఖ భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

