కలం, నల్లగొండ: నల్లగొండలోని మహాత్మా గాంధీ (MG University) విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. వివిధ సబ్జెక్టులలో బోధనా సిబ్బంది కొరతను తీర్చడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పార్ట్ టైం అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫిజిక్ 2 పోస్టులు, సీఎస్ఈ, ఎంసీఏ 2 పోస్టులు, కెమిస్ట్రీ 1 పోస్టు, బాటనీ 1 పోస్టు, ఇంగ్లీష్, తెలుగు, సైకాలజీ, ఇంజనీరింగ్(ఈఈఈ), ఇంజనీరింగ్(ఈసీఈ) విభాగాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, నిబంధనలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ (MG University) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను విశ్వవిద్యాలయ పరిధిలోని సంబంధిత కళాశాలల్లో నేరుగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గేమ్.. సీఎం సభకు వ్యూహాత్మక దూరం!
Follow Us On : WhatsApp

