Mobile Popup Ad
Mobile Popup Ad

భారీ గోల్డ్ స్మగ్లింగ్.. రూ.55 కోట్ల విలువైన బంగారం సీజ్

కలం, వెబ్ డెస్క్: అస్సాం (Assam) రాష్ట్రంలో భారీ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు ఆ రాష్ట్ర పోలీసులు. ఖార్ఘులి ప్రాంతంలో 37 కేజీల 24-క్యారెట్ల బంగారు బిస్కెట్లు, వెండి రేకులతో ఉన్న బంగారాన్ని (Gold Smuggling) గౌహతి పోలీసులు సీజ్ చేశారు. మార్కెట్ లో ఈ బంగారం విలువ రూ.55 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారంతోపాటు నాలుగు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన నిందితుడు అక్షయ్ బన్సోడేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను నెలకు రూ. 80 వేల జీతంతో స్మగ్లింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

గతంలోనూ సదరు నిందితుడు 20 కిలోల బంగారాన్ని అక్రమంగా (Gold Smuggling) రవాణా చేశాడని తెలిపారు. బంగారం స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన అధికారులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి అంతర్జాతీయ బంగారం స్మగ్లర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అస్సాం పోలీసుల చరిత్రలో ఇదే అతిపెద్ద గోల్డ్ సీజ్ కావడం గమనార్హం.

Read Also: మోదీ మాస్క్ పెట్టుకుని బురిడీ కొట్టించిన దొంగ.. వీడియో వైరల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>