Mobile Popup Ad
Mobile Popup Ad

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాల్సిందే.. బండ శ్రీశైలం డిమాండ్

కలం, చండూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వీబీజీరాంజీ బిల్లు రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం చండూరు (Chandur) మండల కేంద్రంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆలిండియా పిలుపు మేరకు వీబీజీ రాంజీ బిల్లు రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను తక్షణమే విరమించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది నిరుపేద కుటుంబాలకు ఉపాధి, ఆదాయ భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు.

పని దినాలు తగ్గించడం, నిధుల విడుదలలో జాప్యం, కూలీలకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం వంటి చర్యల వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వీబీజీ రాంజీ (VBG RAM G) బిల్లు అమల్లోకి వస్తే గ్రామీణ ఉపాధి వ్యవస్థ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పేదలు, వ్యవసాయ కార్మికులు, చిన్న రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ, సీఐటీయూ సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, సీఐటీయూ జిల్లా నాయకులు కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బల్లెం స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సైదులు, లింగస్వామి, రైతు సంఘం నాయకులు కొత్తపల్లి నరసింహ, పరమేశ్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, యాదయ్య, భిక్షపతి, సత్తయ్య, చిరంజీవి, నాగేంద్ర, నరేశ్, జగన్, శివ, గిరి, సంపత్ పాల్గొన్నారు.

Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>