కలం, వెబ్ డెస్క్ : ముంబై చెంబూర్ లో ఘోర బస్సు ప్రమాదం (Chembur Accident ) చోటు చేసుకుంది. ‘యూనివర్సల్ హై స్కూల్’కు చెందిన ఒక స్కూల్ బస్సుపై రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్, బీఎంసీ వార్డు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో తీవ్ర గాయలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్!
Follow Us On: Instagram

