Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యా సంస్కరణలపై కేంద్ర మంత్రితో లోకేశ్ సమీక్ష

కలం, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లా భోగాపురంలో ఉన్న పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో(Dharmendra Pradhan) కలిసి సందర్శించడం ఆనందంగా అనిపించిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో టెక్నాలజీ, డేటా, ఇన్నోవేషన్ ఎలా విద్యా బోధనను మారుస్తున్నాయో సమీక్షించినట్లు పేర్కొన్నారు. LEAP డ్యాష్‌బోర్డు, స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డులు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, స్కిల్ ల్యాబ్స్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ (PAL) ల్యాబ్స్, అలాగే త్వరలో ప్రారంభించనున్న స్మార్ట్ కిచెన్ వంటి కార్యక్రమాలపై పరిశీలన చేసినట్లు చెప్పారు.

విద్యార్థులు తమ కోడింగ్ ప్రాజెక్టులు, డిజిటల్ లెర్నింగ్ నైపుణ్యాలను ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు తెలియజేయడం, ప్రోత్సాహం ఇవ్వడం పట్ల నారా లోకేశ్ (Nara Lokesh) కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి  చంద్రబాబు నేతృత్వంలో ప్రతి విద్యార్థికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్న, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని  స్పష్టం చేశారు.

Read Also: ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>