కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని భిల్వారా (Bhilwara) జిల్లాలో జరిగిన దొంగతనం సంచలనం సృష్టించింది. దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ప్రధాని మోదీ ఫోటో మాస్క్ ను ధరించి చోరికి (Modi Mask Thief) పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి కరేడా పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ మొబైల్ షాప్ లో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం షాప్ తెరిచిన యజమాని దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. దొంగలు మెట్ల గేటు తాళాన్ని పగలగొట్టి దుకాణంలో దుకాణంలోకి చొరబడ్డారు.
సుమారు రూ. 5 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు ఒక విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రధాని మోదీ ఫోటోను పోలిన మాస్క్ ను ధరించిన వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రంలో స్వయంగా మోదీ ఫోటో మాస్క్ పెట్టుకుని దొంగతనం (Modi Mask Thief) చేయడంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
మోడీ ఫోటో ఫేస్ మాస్క్‌తో దొంగతనం
-రాజస్థాన్ రాష్ట్రం భిల్వారాలో మొబైల్ షాప్‌లో చోరీ
-తాళాలు పగలగొట్టి 40 మొబైల్ ఫోన్లు చోరీ చేసిన దొంగ
PM Modi Face Mask Used in Rajasthan Mobile Shop Burglary#ModiMask #Rajasthan #MobileShopTheft #MobileShopBurglary #ModiMaskTheft… pic.twitter.com/omHDIcssS3— Kalam Daily (@kalamtelugu) June 30, 2026
Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!
Follow Us On : WhatsApp

