Mobile Popup Ad
Mobile Popup Ad

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంక చిన్నారి.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: శ్రీలంకకు చెందిన ఓ చిన్నారి (Sri Lankan Girl) అడవి జంతువులతో స్నేహం చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ అమ్మాయి వరి పొలాల వైపు నడుచుకుంటూ వెళ్తుంటే.. ముళ్లపంది, అడవి పిల్లి వెంట నడుస్తున్నాయి. అంతేకాదు.. ఆమె చెప్పే మాటలను శ్రద్ధగా వింటుంటాయి. గతంలో కుక్కల దాడిలో గాయపడిన ఆ ముళ్లపందిని ఈ చిన్నారి రక్షించి ప్రాణాలు కాపాడింది. ఆ సంఘటన తర్వాతే ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. మూగజీవాలపై ఈ బాలిక చూపిస్తున్న ఈ అమాయకపు ప్రేమానురాగాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెను ‘రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్’ (డిస్నీ యువరాణి) అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Also: మోదీ మాస్క్ పెట్టుకుని బురిడీ కొట్టించిన దొంగ.. వీడియో వైరల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>