కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (Telangana Chief Secretary)గా సంజయ్ జాజు (Sanjay Jaju) మంగళవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు ఈ రోజు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు సంజయ్ జాజు మంగళవారం నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంజయ్ జాజుతో పాటు కే. రామకృష్ణా రావును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
Read Also: యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక సమీక్ష
Follow Us On : WhatsApp

