ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్!

కలం, వెబ్ డెస్క్ : మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మక అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలన్నా, గ్రూపుల్లో కలవాలన్నా కచ్చితంగా ఫోన్ నంబర్ షేర్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల ముఖ్యంగా మహిళలకు, ప్రైవసీని కోరుకునే వారికి కొంత ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఇకపై ఆ సమస్యకు శాశ్వతంగా చెక్ పడనుంది. ఫోన్ నంబర్‌తో పని లేకుండా కేవలం ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్ ద్వారానే ఇతరులతో సులభంగా చాట్ చేసే సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేస్తోంది.

ఈ అద్భుతమైన ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వాట్సాప్ (WhatsApp) అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా వినియోగదారులందరూ తమకు నచ్చిన, యూనిక్‌గా ఉండే పేరును ఇప్పుడే రిజర్వ్ చేసుకోవాలని సంస్థ సూచించింది. ఒకసారి ఒకరు ఒక యూజర్‌నేమ్ ఎంచుకుంటే, దానిని ఇతరులు తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి మీకు నచ్చిన పేర్లను ముందే ఖరారు చేసుకోవడం మంచిది.

ఫీచర్‌ను జూన్ 29 నుంచి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఫోన్ నంబర్ తెలియకుండానే సురక్షితంగా సరికొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి వీలవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>