Mobile Popup Ad
Mobile Popup Ad

‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధం

కలం, సినిమా : అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ (Lenin) సినిమా  ట్రైలర్ లాంచ్ ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా జరగనుంది. అభిమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో అఖిల్ అక్కినేని పాల్గొని సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్‌లో ప్రారంభం కానుంది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్న ఈ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం అభిమానులను ట్రైలర్ లాంచ్ వేడుకకు ఆహ్వానిస్తూ, ఉత్సాహభరితమైన సాయంత్రానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే అభిమానులు నిర్వాహకులు అందుబాటులో ఉంచిన పాస్‌లను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాను మురళీ  కిశోర్ అబ్బుర తెరకెక్కిస్తుండగా, క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించింది. ‘లెనిన్’ మూవీ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. ట్రైలర్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>