Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంట్లో పేలిన సిలిండర్.. అంతా సేఫ్!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ సరూర్ నగర్‌లో సిలిండర్ పేలుడు (Cylinder Blast) కలకలం రేపింది. స్థానిక బాబూనగర్‌లో దేవేందర్ అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం ఉదయం సిలిండర్ పేలింది. ఆ ధాటికి ఇంట్లోని వస్తువులు ముక్కలైపోయాయి. వంటిల్లు, పక్కన గది గోడలు కూలిపోయాయి. ప్రమాద సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నా.. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇంట్లో మరో మూడు సిలిండర్లు ఉన్నాయి. అదృష్టవశాత్తూ అవి పేలకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. స్థానికుల సమాచారంతో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సిలిండర్ పేలుడుకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>