Mobile Popup Ad
Mobile Popup Ad

గడియారం విషయంలో గొడవ.. వ్యక్తి దారుణ హత్య

కలం, నిర్మల్​ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ శివారులో ఉన్న వినాయక సాగర్ చెరువు సమీపంలోని కుంటలో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన యువకుడి హత్య కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. డీఎస్పీ శ్రీనివాస్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన షేక్ సోహెబ్ (19) గతంలో అనగందుల సాగర్ వద్ద రూ.2 వేల అప్పు తీసుకున్నాడు.

అలాగే చేతి గడియారం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నిర్మల్ కు చెందిన అనగందుల సాగర్, సారంగాపూర్ మండలం జామ్ గ్రామస్తుడు గుండెన విజయ్ కలిసి షేక్ సోహెబ్‌పై కర్ర, బీరు సీసాతో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అనంతరం నేరాన్ని దాచిపెట్టే ఉద్దేశంతో మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడవేశారు.

మృతుడి తల్లి సాకేర బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిర్మల్ పట్టణ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>