Mobile Popup Ad
Mobile Popup Ad

తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ ఖుష్బూ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణకు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆహార భద్రత అంశాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా వాటర్ అండ్ శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా, వైద్య సంస్థల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.

తాగునీటి సమస్య గుర్తించి పరిష్కరించాలి..

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే గుర్తించి సంబంధిత నీటి సరఫరా శాఖ అధికారుల ద్వారా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాలను ఎంపీడీవోలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఓపెన్ డ్రైనేజ్ కాలువలను నిరంతరం శుభ్రం చేయించాలని, ముఖ్యంగా వచ్చే మూడు నెలలు పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

వర్షాలు కురిసిన తర్వాత మధ్యలో విరామం ఉండడం వల్ల దోమల వ్యాప్తి పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి మున్సిపాలిటీలు, గ్రామీణ స్థానిక సంస్థలు, వైద్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘డ్రై డే’ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రత్యేక అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆహార భద్రతపై అత్యంత జాగ్రత్త..

ఆహార భద్రత అంశంపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని పేర్కొన్న కలెక్టర్ (Khushboo Gupta), జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం, మాంసాహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించి నమూనాలను ప్రయోగశాలలకు పంపుతున్నట్లు తెలిపారు. అన్ని సంక్షేమ శాఖల అధికారులు, హాస్టల్ నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పూర్తిగా సహకరించాలని సూచించారు.

మరింత చైతన్యం కల్పించాలి..

గ్రామపంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని చిన్న హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన విష ఆహార సేవన ఘటనలను ఉదాహరణగా పేర్కొంటూ, ప్రజల్లో ఆహార భద్రత, పరిశుభ్రతపై మరింత చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వచ్చే మూడు నుంచి నాలుగు నెలలు అత్యంత కీలకమైన కాలమని, ప్రతి ఇంటిలో వంటగది పరిశుభ్రత, తాగునీటి భద్రతపై శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, డీఆర్ఎల్వో నిర్మల, జెడ్పీ సీఈఓ, ఇంచార్జి డీపీవో వెంకటరెడ్డి, డీఆర్డీవో నరసింహులు, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జయా బాయి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: బీజేపీ అధ్యక్షుడిది బీహార్ మైండ్‌సెట్.. నితిన్ నబిన్‌పై చామల ఫైర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>