Mobile Popup Ad
Mobile Popup Ad

చంద్రబాబు కంచుకోటలో బంగారు గనులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam) పరిధిలోని చిగురుగుంట–బిసానత్తం ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గనుల శాఖ, ఎన్‌ఎండీసీ (NMDC) అంచనాల ప్రకారం.. దాదాపు 273 హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 18 లక్షల నుంచి 22 లక్షల టన్నుల వరకు బంగారు ముడి ఖనిజం ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడి ముడి ఖనిజం నుంచి టన్నుకు సగటున 5.5 గ్రాముల మేర నాణ్యమైన బంగారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద దాదాపు 8.5 టన్నుల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీయవచ్చని అంచనా వేస్తున్నారు.

గతంలో నిర్వహణ వ్యయం పెరగడం వల్ల 2001లో మూతపడిన ఈ గనులను తిరిగి రీ-ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం (AP Govt) వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ బ్లాక్‌ అభివృద్ధికి సంబంధించి మూడో విడత ఈ-వేలం ప్రక్రియ కొనసాగుతోంది. అవసరమైన పర్యావరణ తదితర అనుమతులు అన్ని పూర్తి చేసుకుని రాబోయే రెండేళ్లలో ఇక్కడ పూర్తిస్థాయిలో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Read Also: అమరావతిలో ఎలా పర్యటిస్తారు?.. వైసీపీపై అచ్చెన్నాయుడు ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>