కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పాతపాలమూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పల్స్ పోలియో రోజున పోలియో చుక్కలు వేయని పిల్లలకు జిల్లా (Mahabubnagar) కలెక్టర్ ఖుష్బూ గుప్తా గుప్తా సోమవారం ఇంటింటి సర్వే ద్వారా పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సర్వే చేసి 0-5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని,జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. ఏ.శ్రీనివాసులు జిల్లా ఇమ్మ్యూననైజేషన్ అధికారి డా.శైలజ, స్టేట్ కన్సల్టెంట్ డా. మొహమ్మద్ అబ్దుల్ వస్సే, వైద్య సిబ్బంది ఉన్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: Instagram

