Mobile Popup Ad
Mobile Popup Ad

నిఖిల్ హత్య.. సీబీఐ విచారణకు హైకోర్ట్ ఆదేశం

కలం, వెబ్ డెస్క్: నాలుగేళ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ధరావత్ నిఖిల్ హత్య కేసు (Nikhil Murder Case) విచారణ కీలక మలుపు తిరిగింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసు సీఐడీ పరిధిలో ఉండగా.. ఇక నుంచి సీబీఐ నజర్ పెట్టబోతుంది. చిలుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసును సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేయబోతుంది.

ఎవరు నిఖిల్.. ఏం జరిగింది..?

సూర్యాపేటకు చెందిన ధరావత్ నిఖిల్ లా విద్యార్థి. 2022 అక్టోబర్ 9న ఇంటి నుంచి అదృశ్యమై, రెండు రోజుల తరువాత రంగారెడ్డి జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువలో శవమై కనిపించాడు. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయని, గొంతు నులిమి హత్య చేశారని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. నిఖిల్ తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తుండగా.. ఆమె తరఫు వారే హత్య చేసినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో దీన్ని అప్పటి ప్రభుత్వం సీఐడీ విచారణకు అప్పగించింది. తమకు సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ తీర్పు ఇచ్చింది.

వారే చంపేశారు: నిఖిల్ తల్లిదండ్రులు

తమ కుమారుడు ఉన్నత కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతోనే చంపేశారని నిఖిల్ తల్లిదండ్రులు మీడియాకు వివరించారు. బర్త్ డే పార్టీ పేరిట రప్పించారని, రెండు రోజుల తరువాత హత్య చేసి కాలువలో పడేసినట్లు కన్నీరు మున్నీరయ్యారు. ఇందుకు సంబంధించి అనేక ఆధారాలు సమర్పించినా.. సీఐడీ అధికారులు తమ వాదనను పట్టించుకోలేదన్నారు. అమ్మాయి తరఫు వారికి అనుకూలంగా, ఇది సూసైడ్ కేసు అంటూ తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. సీబీఐ విచారణతోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>