Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు పండగ ఏరువాక పౌర్ణమి నేడే!

కలం, వెబ్ డెస్క్: విద్యార్థులకు విద్యా సంవత్సరం, ఉద్యోగులకు ఆర్థిక సంవత్సరం ఉన్నట్లుగానే దేశ ప్రజల ఆకలి తీర్చే రైతన్నలకు కూడా సాగు ప్రారంభ సంవత్సరం ఒకటుందని తెలుసా.. అదే ఏరువాక పౌర్ణమి (Eruvaka Pournami). వ్యవసాయిక దేశమైన భారత్ లో దాని ప్రత్యేకత ప్రతి దశలో కనిపిస్తూ వస్తోంది. పురాణాల నుంచి నేటి వరకు సాగుతో విడదీయలేని సంబంధం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలిచి, ప్రపంచానికే అన్నపూర్ణగా భాసిల్లేలా చేయడంలో వ్యవసాయ రంగానిదే అత్యంత ప్రాముఖ్యత. అందుకే, ఈ రోజు జరుపుకునే ఏరువాక పౌర్ణమిని అన్నదాతలు అత్యంత పవిత్రంగా నిర్వహిస్తుంటారు.

ఏం చేస్తారంటే..

వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు వానలు బాగా కురవాలని పొలం వద్ద దేవతలకు పూజలు నిర్వహిస్తుంటారు. పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. దుక్కి దున్ని, భూమిని సారవంతం చేసే ఎద్దులను అందంగా అలంకరించి, వాటి కొమ్ములకు రంగులు అద్దుతారు. సాగు పనుల్లో విరివిగా వాడే నాగలి, పార, గునపం వంటి పరికరాలను శుభ్రం చేసి, పసుపు కుంకుమలు పూస్తారు. ఈ రోజున అన్నదాతలు ఎవరికీ అప్పు ఇవ్వరు. తీసుకోరు. అలా తీసుకుంటే, ఏడాదంతా తమ ఇళ్లల్లో దారిద్య్రం తాండవిస్తుందని బలంగా నమ్ముతుంటారు. అనంతరం, నాగలి పట్టి దుక్కి దున్ని సాగు ప్రక్రియను ప్రారంభిస్తారు.

పెద్ద చరిత్రే..

రామాయణ కాలం నుంచే ఏరువాక పౌర్ణమి (Eruvaka Pournami) జరుపుకుంటున్నట్లు ఇతిహాస ఆధారాలున్నాయి. రాముడి తన రాజ్యంలో పండే పంటల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసేవారట. తనను కలవడానికి వచ్చిన భరతుడితో కూడా రాజ్యంలో ఏయే పంటలు వేస్తున్నారు.. పశు నిర్వహణ సరిగ్గా చేస్తున్నారా.. అని అడిగేవారట. ఇక, కాకతీయుల సామ్రాజ్యంలో కూడా ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించేవారని గొడిశాల శాసనంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఏరువాక పౌర్ణమిని ఏరువాక గొబ్బిలి అని పిలిచేవారు. ఇలా, భారత సంస్కృతిలో సాగు పండగైన ఏరువాక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది.

Read Also:  మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నారా.. ఇవే కీలకం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>