సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన రగ్బీ ప్రెసిడెంట్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రగ్బీ ప్రీమియర్ ఫైనల్ లీగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలుపొంది కప్పు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ట్రోఫీ ఆవిష్కరించే క్రమంలో ప్రసంగించిన రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ సీఎం రేవంత్ రెడ్డి పేరును తప్పుగా చెప్పాడు. ఈ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కాగా, సీఎం చిరంజీవి అని పేర్కొనడం గమనార్హం.

ఊహించని ఈ పరిణామానికి సీఎం రేవంత్ రెడ్డి సైతం కొన్ని సెకండ్ల పాటు ఆశ్చర్యపోయారు. అనంతరం, ట్రోఫీ బహుకరణ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రగ్బీ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి కనీసం రాష్ట్ర సీఎం పేరు కూడా తెలుసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>