Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం చంద్రబాబు జిల్లాల టూర్

కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) జులై ఒకటో తేదీ నుంచి వరుసగా జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. ఈ మేరకు సీఎంవో వివరాలు వెల్లడించింది. ఒకటో తేదీన నెల్లూరు జిల్లాకు వెళ్తారు. చిల్లకూరు మండలంలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ చేస్తారు. అక్కడే ప్రజలతో ముఖాముఖిగా సంభాషిస్తారు. అదే రోజు సాయంత్రం తిరుపతి జిల్లాకు వెళ్తారు. సత్యవేడులోని శ్రీ సిటీలో రూ.750 కోట్ల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేయబోతున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేయనున్నారు.

  • రెండో తేదీన ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వీబీ జీ రామ్ జీ పథకంపై నిర్వహించబోతున్న ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్’లో పాల్గొని ప్రసంగించబోతున్నారు. అదే రోజు సాయంత్రం జీఎస్డీపీ వర్క్ షాప్ సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక అంశాలను వివరించనున్నారు.
  • మూడో తేదీన కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లెలో ‘రాయలసీమ స్టీల్ ప్లాంట్’ పనులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తన సొంత నియోజకవర్గం కుప్పంకు వెళ్తారు.
  • మూడో తేదీ నుంచి అయిదో తేదీ వరకు కుప్పంలోనే ఉంటారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ప్రత్యేకంగా నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత సమీక్షలో నిర్దేశించిన పనుల పురోగతిని ఆరా తీయబోతున్నారు. 5వ తేదీన సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>