కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ అఖిలభారత యాదవ మహాసభ (Yadava Mahasabha) జాతీయ కార్యవర్గ సభ్యులు సందబోయిన మహేందర్ నాథ్ యాదవ్ (Mahender Nath Yadav) 56వ జన్మదిన వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఉజ్వల పార్కు వద్ద గల గోకుల్ ట్రస్ట్ భవన్ లో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా శాఖ, పట్టణ శాఖ మంచాల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. బోయవాడలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం ముకరంపుర లోని గల నియో అనాధ హాస్టల్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని అనాధ పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పదో డివిజన్ కార్పొరేటర్ సోగాని కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. మహేంద్ర నాథ్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి పేద ప్రజల కోసం, యాదవ సంఘం అభివృద్ధి కోసం నిరంతరం అంకితభావంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో యాదవ సంఘానికి మరిన్ని నిరుపేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మహేందర్ నాథ్ యాదవ్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్, యాదవ సంఘం ఫౌండర్ మంచాల పోచన్న యాదవ్, యాదవ ట్రస్ట్ చైర్మన్ బాబ్బురి కుమార్ యాదవ్, ఆవుల మలేష్ యాదవ్, అఖిల భారత యాదవ మహా సభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందేబోయిన ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు చేర్ల పద్మా యాదవ్, యాదవ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి యాదవ్, పలుమారు మల్లేశం యాదవ్, కాల్వ లక్ష్మీ యాదవ్, జిట్టవేణి పరుశరాములు యాదవ్, తిరుపతి యాదవ్, కాల్వ మల్లేశం యాదవ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, రాములు యాదవ్, జంగ కొమురయ్య యాదవ్, బొలవేని సంతోష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

