నా కంబ్యాక్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది: ఆర్థర్ ఫిల్స్

కలం, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్‌ను హిప్ గాయం కారణంగా కోల్పోయిన ఫ్రాన్స్ యువ టెన్నిస్ స్టార్ ఆర్థర్ ఫిల్స్ (Arthur Fils).. ఇప్పుడు వింబుల్డన్‌ (Wimbledon) లో బలమైన పునరాగమనం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. గతంలో ఎన్ని గాయాలు ఎదురైనా ప్రతిసారి మరింత మెరుగైన ఆటతో తిరిగొచ్చానని, ఈసారి కూడా అదే నమ్మకంతో ఉన్నానని వెల్లడించాడు. గత ఏడాదిలో వరుసగా గాయాలు ఇబ్బంది పెట్టినా తన ఆటపై విశ్వాసం మాత్రం ఎప్పుడూ తగ్గలేదని ఫిల్స్ తెలిపాడు.

కోర్టులోకి తిరిగి అడుగుపెడితే మంచి టెన్నిస్ ఆడగలననే నమ్మకం తనకు ఎప్పుడూ ఉంటుందని, అందుకే ప్రతి కంబ్యాక్ బలంగానే ఉంటుందని చెప్పాడు. ఈ ఏడాది వెన్ను గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిల్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. బార్సిలోనా ఏటీపీ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మయామి, మాడ్రిడ్ ఏటీపీ మాస్టర్స్-1000 టోర్నీల్లో కూడా చివరి దశ వరకు చేరి మంచి ఫామ్‌ను కొనసాగించాడు. గ్రాస్ కోర్టుల్లో ఆడటం తనకు చాలా ఇష్టమని ఫిల్స్ తెలిపాడు.

గడ్డిపై జారుతూ, వేగంగా కదులుతూ ఆడటం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని చెప్పాడు. ప్రస్తుతం ప్రాక్టీస్ కూడా చాలా బాగా సాగుతోందని, శరీరం పూర్తిగా సహకరిస్తోందని వెల్లడించాడు. గత ఏడాది వింబుల్డన్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన ఫిల్స్.. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. తొలి రౌండ్‌లో బెల్జియం ఆటగాడు రాఫెల్ కొలిగ్నాన్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్‌లో మాటియో బెరెట్టినీ లేదా స్టాన్ వావ్రింకాలో ఒకరిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>