Mobile Popup Ad
Mobile Popup Ad

బ్రెజిల్‌కు జపాన్ సవాల్.. నాకౌట్‌లో అసలు సమరం!

కలం, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ 2026 నాకౌట్ దశలో మరో భారీ పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ దశను అజేయంగా ముగించిన బ్రెజిల్ (Brazil), జపాన్ జట్లు సోమవారం జరిగే కీలక మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజేత రౌండ్ ఆఫ్-16లో అడుగుపెడుతుంది. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న బ్రెజిల్‌కు, సంచలనాలకు చిరునామాగా మారిన జపాన్ గట్టి సవాల్ విసరనుంది.

బ్రెజిల్ అగ్ర స్థానం..

గ్రూప్-సీలో బ్రెజిల్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొరాకోతో తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న బ్రెజిల్.. ఆ తర్వాత హైటీ, స్కాట్లాండ్‌పై వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వినీషియస్ జూనియర్ తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో బ్రెజిల్ మొత్తం 15 గోల్స్ చేయడం ఆ జట్టు దూకుడును చూపిస్తోంది.

ఎదురుదాడే జపాన్ వ్యూహం..

మరోవైపు జపాన్ కూడా ఈ టోర్నీలో ఇంకా ఓటమి చూడలేదు. గ్రూప్-ఎఫ్‌లో నెదర్లాండ్స్, స్వీడన్‌తో డ్రా చేసుకున్న జపాన్.. ట్యునీషియాపై 4-0తో ఘన విజయం సాధించి నాకౌట్‌కు చేరుకుంది. బంతి తమ వద్ద లేనప్పుడు కట్టుదిట్టమైన రక్షణ, అవకాశం దొరికిన వెంటనే వేగవంతమైన ఎదురుదాడులు చేయడం జపాన్ ఆటలో ప్రధాన బలంగా మారింది. ఈ మ్యాచ్‌లో వ్యూహాలే కీలకంగా మారనున్నాయి.

అందులో బ్రెజిల్ ప్రత్యేకం..

బ్రెజిల్ ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలో ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఫుల్‌బ్యాక్‌లను కూడా ముందుకు పంపిస్తూ దాడులు చేస్తుంది. అయితే అదే సమయంలో వెనుక ఖాళీలు ఏర్పడితే వాటిని జపాన్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు వినీషియస్ జూనియర్‌తో పాటు బ్రెజిల్ దాడులను అడ్డుకోవాలంటే జపాన్ రక్షణ విభాగం క్రమశిక్షణతో ఆడాల్సి ఉంటుంది.

ఇరు జట్ల మధ్య గత అయిదు మ్యాచ్‌ల్లో బ్రెజిల్ మూడు విజయాలు సాధించింది. అయితే 2025 అక్టోబర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో జపాన్ 3-2తో బ్రెజిల్‌ను ఓడించింది. ఆ విజయం ఇప్పుడు జపాన్‌కు అదనపు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అవకాశం ఉంది.

ఇరు జట్లు..

బ్రెజిల్: అలిసన్, ఎడర్సన్, వెవర్టన్, డగ్లస్ శాంటోస్, అలెక్స్ శాండ్రో, గాబ్రియెల్ మగల్హాయెస్, మార్క్విన్యోస్, డానిలో, బ్రెమర్, ఇబానెజ్, లియో పెరీరా, బ్రూనో గిమరాయిస్, కాసెమిరో, డానిలో శాంటోస్, ఫాబిన్యో, లూకాస్ పాక్వెటా, రాఫిన్హా, నెయ్మార్, వినీషియస్ జూనియర్, లూయిజ్ హెన్రికే, మాథ్యూస్ కున్హా, గాబ్రియెల్ మార్టినెల్లీ, ఇగోర్ థియాగో, ఎండ్రిక్, రయాన్.

జపాన్: టోమోకి హయకావా, కైసుకే ఒసాకో, జియోన్ సుజుకి, కో ఇటాకురా, హిరోకి ఇటో, యుటో నాగటోమో, అయుము సెకో, యుకినారి సుగవారా, జున్నోసుకే సుజుకి, షోగో తనిగుచి, టకేహిరో టోమియాసు, సుయోషి వటనాబే, రిట్సు డోయన్, వతారు ఎండో, జున్యా ఇటో, డైచి కమాడా, టకేఫుసా కుబో, కైటో నకమురా, కైషు సానో, ఆవో తనాకా, కైసుకే గొటో, డైజెన్ మయెడా, కోకి ఒగావా, కెంటో షియోగై, యుయిటో సుజుకి, అయాసే ఉయెడా.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>