కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని (Nirmal BJP Office) ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ హైదరాబాద్ నుండి ఆదివారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తేవడానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, గ్రామ సర్పంచ్ గుమిడ్యాల లక్ష్మి, బైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ లు దత్తాద్రి, మౌనిక, జిల్లా ఇన్చార్జి స్రవంతి రెడ్డి, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ కౌన్సిలర్ లు, సర్పంచులు, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

