కలం, నిర్మల్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) 105వ జయంతి సందర్భంగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పీవీ విగ్రహానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు కేవలం తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి మార్గదర్శకులని అన్నారు.
దేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ధైర్యవంతమైన నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారని పేర్కొన్నారు. నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి పీవీ వేసిన సంస్కరణల పునాదులు ఎంతో కీలకమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, తదితరులు పాల్గొన్నారు.

