Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో లిక్కర్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని ఎయిర్‌పోర్టుల్లో లిక్కర్ అమ్మకాలకు (AP Liquor) కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్టుల్లో వైన్స్, బార్లకు 24 గంటలు అనుమతిని ఇచ్చింది. అంతేకాదు లైసెన్స్ ఫీజులు, పన్నులపై కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.

దీని ప్రకారం.. బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము రూ. 5 లక్షలు, మద్యం షాపుల దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు, ఎయిర్ పోర్టులో వైన్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ రూ. కోటి, 20 లక్షల సర్క్యులేషన్ దాటిన ఎయిర్ పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ రూ. 25 లక్షలు , 20 లక్షల లోపు సర్క్యులేషన్ ఉంటే రూ. 15 లక్షలు ఉండనుంది. మూడేళ్ల తర్వాత ఎక్సైజ్ విధానంపై సమీక్ష ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: గుండాలు, రౌడీలతో మా పై దాడి: పేర్ని నాని

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>