కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ మేరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా మొత్తం 74.49 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.148.97 కోట్ల మంజూరు చేసినట్లు ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. మంజూరైన రోడ్లలో హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన మొత్తం 8 ప్రధాన రహదారి పనులు ఉన్నాయి. వీటి ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలో భారీ మొత్తంలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ, వాణిజ్య, విద్య, వైద్య సేవలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ రహదారి ప్రాజెక్టులు కీలక మైలురాయిగా నిలుస్తాయని చెప్పారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంజూరైన హామ్ రోడ్ల వివరాలు:
హనుమకొండ జిల్లా:
1.హనుమకొండ జిల్లాలోని గుంటూరుపల్లి – కేశవాపూర్ వయా తిమ్మాపూర్ రహదారి బలోపేతం (3.99 కి.మీ) రూ.3.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు
2.హనుమకొండ జిల్లాలోని వంగర – ములకనూరు – భీమదేవరపల్లి రహదారి బలోపేతం 5.00 కి.మీలకు రూ.4.39 కోట్ల రూపాయలు
3.హనుమకొండ జిల్లా పరిధిలోని బావుపేట్ – కమలాపూర్ రోడ్ (బావుపేట్, ఆరేపల్లి, గుంటూరుపల్లి, శంబునిపల్లి, కనిపర్తి, కమలాపుర్) 6.00 కి.మీలకు రూ.6.95 కోట్ల రూపాయలు
కరీంనగర్ జిల్లా
4.కొత్తగట్టు–దుద్దెనపల్లి రహదారి బలోపేతం 10.90 కి.మీలకు రూ.9.57 కోట్ల రూపాయలు
సిద్దిపేట జిల్లా:
5.తంగలపల్లి – బద్దిపడిగ వయా గుండారెడ్డిపల్లి రహదారి బలోపేతం 8.00 కి.మీలకు రూ.7.02 కోట్ల రూపాయలు
6.ముల్కనూర్–కొహెడ రహదారి బలోపేతం 16.00 కి.మీలకు 18.53 కోట్ల రూపాయలు
7.కోహెడ – దేవక్కపల్లి వయా రామచంద్రాపూర్ రహదారి విస్తరణ, బలోపేతం 14.60 కి.మీ లకు 40.1 కోట్ల రూపాయలు
8.హుస్నాబాద్–అక్కన్నపేట పీడబ్ల్యూడీ రహదారి విస్తరణ, బలోపేతం 10.00 కి.మీ. లకు రూ.58.91 కోట్లు
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On: Sharechat

