కలం, నిర్మల్ : సీపీఐ (CPI) ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి భూక్య రమేష్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఈ శిక్షణ తరగతులు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు హాజరుకానున్నారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని పార్టీ నాయకులు, పదాధికారులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని భూక్య రమేష్ కోరారు.
Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్కు చిట్ట చివరి స్థానం!
Follow Us On: Instagram

