Mobile Popup Ad
Mobile Popup Ad

బంపర్​ ఆఫర్..​ రూ.1 కే డ్రెస్సు.. ఎగబడ్డ జనం

కలం, వెబ్‌ డెస్క్​ : NEWME Mumbai | బంపర్ ఆఫర్​ అంటే చాలు జనాలకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. వెంటనే ఆఫర్ ఉన్న వస్తువులను కొనడానికి పరుగెత్తుకుంటూ వెళ్లి మరీ క్యూలో నిలుచుంటారు. ఒకరిమీద ఒకరు పడుతూ.. తగ్గేదేలే అంటూ నానా ప్రయాసలను ఎదుర్కొని ఆఫర్​ ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఘటనే ​ముంబయి లో చోటు చేసుకుంది.

NEWME అనే దుస్తుల బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా కేవలం రూ.1 కే డ్రెస్సు అని బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అని మలాడ్ వెస్ట్​ లోని ఇన్ఫినిటీ మాల్​ కు జనం పోటేత్తారు. తెల్లవారుజామునుంచే వందలాది మంది క్యూలో నిలుచున్నారు. అయితే, ఆఫర్​ కేవలం మొదటి 100 మంది కస్టమర్లకు అని చెప్పడంతో షాపింగ్​ మాల్ గేట్​ వద్ద గుమిగూడారు.

మాల్​ తెరిచిన వెంటనే లోపలికి దూసుకెళ్లారు. తక్కువ ధర వస్తువులను దక్కించుకోవడానికి ఆత్రుతతో పరిగిత్తిన వీడియోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఎవర్రా మీరంతా అంటూ కొందరు నెటిజన్లు జోకులు పేలుస్తుంటే.. ఆఫర్​ ఉంటే చాలు వెర్రి జనాలు ఆగరని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.

Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>