కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలోని ఫెర్టిలైజర్ అండ్ సీడ్స్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత కల్పించాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ (Karimnagar) ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీలోని గోదాం వద్ద కరీంనగర్ జిల్లా ఫెర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కరపత్రాన్ని కార్మికులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టేకుమల్ల సమ్మయ్య, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్‌లు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ గోదాముల్లో, కంపెనీల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత లేకుండా పనులు చేస్తున్నారని, వీరికి ఫెర్టిలైజర్స్ కంపెనీ గాని ఫెర్టిలైజర్స్ డీలర్స్ గాని ఎలాంటి పని భద్రత కల్పించకపోవడం వల్ల లారీ దించేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కాబట్టి వీరికి ప్రమాద బీమా సౌకర్యం, పీఎఫ్, సౌకర్యం కల్పించాలని, కల్పించే విధంగా కార్మిక శాఖ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఫెర్టిలైజర్ సీడ్స్ కంపెనీ గోదాములలో పనిచేస్తున్న కార్మికులందరినీ ఐక్యం చేసి కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని, న్యాయమైన డిమాండ్ల పైన సెప్టెంబర్‌లో జరిగే రాష్ట్ర మహాసభల్లో సమస్యలపై తీర్మానం చేయనున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలోని ఫెర్టిలైజర్, సీడ్స్ కంపెనీలలో గోదాముల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కలిసి కట్టుగా వచ్చి సెప్టెంబర్ 6, 7, 8వ తేదీలలో కరీంనగర్‌లో జరిగే ఏఐటీయూసీ (Karimnagar AITUC) రాష్ట్ర 4వ మహాసభలలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ గోదాంల హమాలి సంఘం జిల్లా అధ్యక్షులు కడారి బీరయ్య, ఉపాధ్యక్షులు ఆవుల లక్ష్మణ్, కార్యదర్శి రాజు, కోశాధికారి మామిళ్ళపల్లి శంకరయ్య, నాయకులు రాయమల్లు, పి. మహేష్, కడారి కొమురయ్య, బి. అంజయ్య, పుల్ల మహేష్, రేషవేని సదయ్య, వేల్పుల రాజయ్య, కె. ఐలయ్య, ఆర్. రాములు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.
Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం!
Follow Us On : WhatsApp

