Mobile Popup Ad
Mobile Popup Ad

’తల్లికి వందనం‘పై చంద్రబాబు కీలక ప్రకటన

కలం, వెబ్​ డెస్క్​ : ప్రజల కోసమే కూటమి ఏర్పడింది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. శనివారం మార్కాపురం జిల్లా కృష్ణంశెట్టిపల్లిలో పర్యటించిన సీఎం సంజీవని డిజిటల్​ నెర్వ్​ సెంటర్​ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.

ప్రజల ఆరోగ్యం కోసమే సంజీవని ప్రాజెక్టును తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

ప్రతి ఏడాది రైతులకు రూ.20 వేలు అందిస్తున్నామని గుర్తు చేశారు. మనసు ఉంది కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెలలో తల్లికి వందనం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Read Also: 1 సీటు వచ్చే వరకు మీరు తగ్గకండి.. వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>