నిర్మ‌ల్‌లో బైక్‌ని ఢీకొన్న టిప్ప‌ర్‌.. వ్య‌క్తికి తీవ్ర గాయాలు!

క‌లం, నిర్మల్: నిర్మ‌ల్‌ (Nirmal)లో శ‌నివారం ఓ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామ శివారులో ఓ టిప్పర్, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన కొండూరు చిన్న రాజేశ్వర్ శనివారం ఉదయం నిర్మల్ పట్టణంలో పాలు విక్రయించి త‌న బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు.

వెంగ్వాపేట్ గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్క‌డి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>