కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఔట్‌గేట్ సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పాల్వంచ టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, ఐదు అడుగుల ఎత్తుతో చామనచాయ రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. మరణించే సమయంలో ఆయన ఎరుపు రంగు టీ-షర్ట్, నీలం రంగు లుంగీ ధరించి ఉన్నట్లు వెల్లడించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి గుర్తింపునకు సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆనవాళ్లు కలిగిన వృద్ధుడిని ఎవరైనా గుర్తించినా లేదా ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పాల్వంచ (Palwancha) టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిసిన వారు 8712682051, 8712682050, 9701249654 నంబర్లకు సంప్రదించి గుర్తుతెలియని మృతుడి వివరాలను అందించాలని, దర్యాప్తుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: X(Twitter)

